Andhra PradeshPolitics
Trending

వైజాగ్‌ స్టీల్‌పై జగన్‌ భారీ ఎత్తు ‌- లేఖ మోడీకి- ఇరికించింది విపక్షాన్ని-చిక్కుల్లో ఇర్రుకుంటారా…

Andhra CM writes to PM Modi on Vizag steel pant issue: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయం రోజురోజుకీ తీవ్రతరం అవుతుండటం ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని తేలిపోవడంతో ఇక మైలేజ్‌ గేమ్‌ మొదలైంది. ఇందులో భాగంగా విపక్ష టీడీపీ.. అధికార పార్టీ నాయకులను రాజీనామాలకు డిమాండ్‌ చేస్తుండగా.. దీనికి కౌంటర్‌గా ప్రధానిని అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎం జగన్‌.. ఇందులో టీడీపీతో పాటు ఇతర విపక్షాలను కూడా లాగారు. ఇప్పుడు వారి స్పందన ఎలా ఉన్నా జగన్‌కే మైలేజ్‌ అన్న చర్చ జరుగుతోంది.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో వైసీపీకి చుక్కలు ఏపీలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కోసం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్రం క్లారిటీ ఇచ్చేసినా ఇంకా లేదు లేదు అంటూ బుకాయిస్తున్న నేతలకు షాకిచ్చేలా నిన్న ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ వందశాతం ప్రైవేటీకరణ తప్పదని లిఖిత పూర్వకంగానే చెప్పేశారు. దీంతో ఇప్పుడు బీజేపీతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఏపీలో పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ వైసీపీ పరిస్ధితి అలా కాదు.. పార్లమెంటులో 27 మంది ఎంపీలు, ఏపీ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన వైసీపీకి ప్రజల్లో ముఖం చాటేయాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. దీంతో ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button