CrimeNationalPolitics

బీజేపీ ఎంపీ కొడుకు కౌషల్ కిషోర్ పై కాల్పులు

BJP MP Kaushal Kishore’s son shot at in Lucknow: బీజేపీ ఎంపీ కౌషల్ కిషోర్ కుమారుడు ఆయూష్‌ (౩౦)పై బుధవారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజూ లాగానే ఉదయం నడకకు వెళ్లిన ఆయూష్‌పై మదీయవా ప్రాంతంలో బైక్ వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయూష్‌ ఛాతిపై బుల్లెట్‌ గాయం అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

ఎంపీ కౌషల్ కిషోర్ లాల్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన భార్య జై దేవి.. మాలిహాబాద్ ఎమ్మెల్యే. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇంతవరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దీని దాడి వెనుక ఎవరున్నారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఆయూష్‌కు గతంలో కొంతమంది వ్యక్తులతో శతృత్వం ఉన్నట్లు పోలీసులు తెలిపారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button