CrimeTelangana
Trending

పబ్ లో పదేళ్ల బాలిక… నోటీసులు ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాదులోని ఓ పబ్ లోకి పదేళ్ల బాలికను అనుమతించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గచ్చిబౌలి పోలీసులు స్పందించినారు. పబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినారు. గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ పబ్ లోకి ఓ కుటుంబం పదేళ్ల బాలికను కూడా తీసుకువచ్చింది.

అయితే ఓ యువకుడు పబ్ లో బాలిక ఉన్న వైనాన్ని వీడియో తీసి నగర పోలీసు కమిషనర్ కు ట్వీట్ చేసినాడు. దాంతో విషయం బయటపడింది. 21 ఏళ్ల లోపు వారిని పబ్ లోకి అనుమతించరాదన్న నిబంధనను పబ్ యాజమాన్యం ఉల్లంఘించినట్టు తాజా ఘటనతో వెల్లడైంది. దీనిపై వివరణ కోరుతూ పబ్ మేనేజర్ కు, యాజమాన్యానికి పోలీసులు నోటీసులు పంపినారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button