EntertainmentNational

తల్లి కాబోతున్న ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ !

Shreya Ghoshal announces pregnancy says Baby: సుమధుర గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతోంది. బేబీ శ్రేయాదిత్య కమింగ్ అంటూ ఆ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. చిన్నారి శ్రేయాదిత్య రాబోతోంది. ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరి ప్రేమ, దీవెనలు కావాలని శ్రేయ ట్వీట్ చేసింది.

హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, అస్సామీ.. ఇలా పలు భారతీయ భాషల్లో శ్రేయ పాటలు పాడి మధుర గాయనిగా పేరు తెచ్చుకున్నారు . ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. తన మిత్రుడు శైలాదిత్యను 2015లో వివాహం చేసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button