Life StyleNational
Trending

అతడిని కోటీశ్వరుడిని చేసిన 157 చేపలు…

అదృష్టం ఎవ‌ర్ని ఎప్పుడు ఎలా వ‌రిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. నమ్ముకున్న వృత్తి వ‌ల‌న మొద‌ట్లో ఇబ్బందులు కూడా ఎదురుకావొచ్చు. ఒక్కోసారి అదే వృత్తి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. వ‌ర్షాకాలం అందులోను స‌ముద్రంలో అల‌జ‌డి ఎక్కువగా ఉండ‌టంతో గ‌త నెల రోజులుగా స‌ముద్రంలో వేట‌కు ప్ర‌భుత్వం అనుమ‌తినివ్వ‌లేదు. నెల రోజుల త‌రువాత తాజాగా ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు రావ‌డంతో చంద్ర‌కాంత్ అనే మ‌త్స్య‌కారుడు ముంబై-పాల్ఘ‌ర్ స‌ముద్రంలో వేట‌కు వెళ్ళినాడు. ప‌దిమందిని తీసుకొని వేట‌కు వెళ్లిన చంద్ర‌కాంత్ వ‌ల‌కు 157 చేప‌లు చిక్కినాయి. అయితే ఈ చేప‌లన్నీ కూడా ఘోల్ జాతికి చెందిన చేప‌లు కావ‌డంతో అత‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. చంద్ర‌కాంత్ బోటు ఒడ్డుకు చేరుకోగానే వ్యాపారులు ఆ చేప‌ల‌ను కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డ్డారు. ఒక్కో చేప‌ను రూ.85 వేల చొప్పున కొనుగోలు చేసినారు. దీంతో రాత్రికి రాత్రే చంద్ర‌కాంత్ కోటీశ్వ‌రుడ‌య్యాడు. న‌మ్ముకున్న వృత్తి త‌న‌కు అన్యాయం చేయ‌లేద‌ని చంద్ర‌కాంత్ పేర్కొన్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button