HealthNational
Trending

కరోనా కలకలం.. అసోంలో మళ్లీ రాత్రి పూట కర్ఫ్యూ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. అసోంలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో తాజాగా 570 కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో ఐదుగురు మరణించారు.

దీంతో, అసోం ప్రభుత్వం మళ్లీ నైట్ కర్ఫ్యూనూ విధించింది. ఈ రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. గత వారం రోజుల్లో 10 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించినారు.

అసోంలో ఇప్పటి వరకు 5,89,426 కరోనా కేసులు నమోదు కాగా, 5,660 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,554 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రాత్రి 8 గంటల కల్లా హోటళ్లు, దాబాలు, దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button