Andhra PradeshEntertainmentTelangana
Trending

ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాశ్.. ఘనంగా నిశ్చితార్థం!

బిగ్ బాస్ ఫేమ్, హాస్య నటుడు ముక్కు అవినాశ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అవినాశ్ త్వరలోనే అనుజతో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సందర్భంగా అవినాశ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, సరైన వ్యక్తి మన జీవితంలోకి వస్తుంటే వేచి చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. తమ కుటుంబాలు కలిశాయని, అనుజతో నిశ్చితార్థం జరిగిందని తెలిపినాడు.

పెళ్లి ఎప్పుడు? అని మీరందరూ తనను ఎన్నోసార్లు అడిగారని, అతి త్వరలోనే నా అనుజతో వివాహం జరుగుతుందని పేర్కొన్నాడు. ఎప్పటి మాదిరే మీ అందరి ఆశీస్సులు తనకు ఉండాలని కోరినాడు.

కరోనా నేపథ్యంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరైనారు. మరోవైపు అవినాశ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీముఖి, మెహబూబ్, నోయల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపినారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button