Andhra PradeshCrime
Trending

విశాఖ చమురు శుద్ధి కర్మాగారంలో గ్యాస్ లీకేజి కలకలం

విశాఖపట్నంలో మరోసారి కలకలం చెలరేగింది. ఇక్కడి హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారంలో గ్యాస్ లీక్ అయ్యింది. గ్యాస్ లీక్ అయిన వెంటనే రిఫైనరీలో ప్రమాద హెచ్చరికలు జారీ అయినవి. సైరన్ మోగడంతో కార్మికులు ప్లాంట్ నుంచి బయటికి పరుగులు తీసినారు. గ్యాస్ లీకేజిని గుర్తించిన అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని హెచ్ పీసీఎల్ అధికారులు తెలిపినారు. చమురు శుద్ధి పనులు మళ్లీ కొనసాగుతున్నట్టు వెల్లడించినారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button