BusinessNational

బిగ్ రిలీఫ్.. లీటరుకు సరాసరి రూ.8 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు? కారణమిదే!

Petrol, diesel prices to come down? Govt mulling cut in excise: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు సిద్ధం అవుతోందా? వెలువడుతున్న నివేదికలను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంధన ధరలను భారీగా తగ్గించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో వాహనదారులపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. సామాన్యులపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.

మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8.5 మేర తగ్గించ వచ్చును అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నుల ద్వారా రూ.3.2 లక్షల కోట్లు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుత ట్యాక్స్ రేట్ల ప్రకారం చూస్తే.. రూ.4.35 లక్షల కోట్లు వసూలు అవుతాయి.

అందువల్ల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8.5 తగ్గించేందుకు అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ఈ స్థాయిలో సుంకాలు తగ్గించినా కూడా కేంద్రంపై భారం పడదని తెలిపింది. రూ.3.2 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొంది.

ఇకపోతే మోదీ సర్కార్ క్రూడ్ ధరలు తక్కువగా ఉన్నా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచుకుంటూనే వచ్చింది. ప్రస్తుతం పెట్రోల్‌పై ట్యాక్స్ 60 శాతంగా, డీజిల్‌పై 54 శాతంగా ఉన్నాయి. దీంతో వాహనదారులపై తీవ్రమైన ప్రభావం పడుతోంద. పెట్రోల్ రేటు రూ.100 వద్ద ఉంది. డీజిల్ రూ.90 దాటేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button