Andhra PradeshEntertainment

పవన్ ను కలిసిన ఆనందంలో బిగ్ బాస్ భామ అషూ రెడ్డి

Bigg Boss Fame Ashu Reddy Meets Pawan Kalyan: బిగ్ బాస్ మూడవ సీజన్ లో అలరించిన యూట్యూబ్ భామ అషూ రెడ్డి (అశ్విని) ఇప్పుడు సంతోష సాగరంలో ఓలలాడుతోంది. అందుకు కారణం… అమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవడమే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కోసం పవన్ సెట్స్ పై ఉండగా, అక్కడే అషూ రెడ్డి నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. దాంతో పవన్ ను కలిసేందుకు వెళ్లిన అషూకి ఊహించని పరిణామం ఎదురైంది.

ఏదో కొన్ని నిమిషాలు మాట్లాడి పంపిస్తాడని ఆమె అనుకున్న , పవన్ ఆమెతో ఏకంగా 2 గంటలు ఆప్యాయంగా ముచ్చటించడం విశేషం. ఈ సందర్భంగా పవన్ తన టాటూ సంగతి ప్రస్తావించాడని చెప్పి అషూ మురిసిపోతోంది. గతంలో తన శరీరంపై పవన్ కల్యాణ్ పేరును ఈ బబ్లీ గాళ్ పచ్చబొట్టు పొడిపించుకున్న సంగతి తెలిసిందే.

ఇక, తాజా గా కలిసిన విషయానికొస్తే పవన్… ఈ భామకు ఓ లెటర్ కూడా అందించాడట. ఆ లెటర్ ను తనే ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. మీరు కోరుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను అని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో అషూ ఆనందం ఆకాశాన్ని అందింది . పవన్ ను కలవడమే ఓ గోల్డెన్ చాన్స్ అయితే, ఏకంగా రెండు గంటల పాటూ అపాయింట్ మెంట్ దొరకడం, పైగా పవర్ స్టార్ స్వయంగా లేఖ ఇవ్వడం అషూని నిలవన్వివడంలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button