Andhra PradeshPolitics
Trending

అమరావతి అసైన్డ్ భూముల జీవో 316పై తదుపరి చర్యలను నిలిపివేసిన హైకోర్టు

రాజధాని భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములు తీసుకున్న రైతులకు అనుకూలంగా కోర్టు ఆదేశాలిచ్చింది. వారికి నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకుంటూ ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 316 జీవోపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినది. ఆ జీవోకు సంబంధించి తదుపరి చర్యలను తీసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ఇస్తూ గత ప్రభుత్వం జీవో 41ని తీసుకొచ్చిందని, కానీ, ఇప్పుడు దానిని రద్దు చేసి రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారని కోర్టుకు రైతుల తరఫు న్యాయవాది వివరించినారు. అయితే, వారి వాదనలను తోసిపుచ్చిన ప్రభుత్వ తరఫు న్యాయవాది, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కోర్టును కోరినారు. అయినా, తదుపరి చర్యలను నిలిపేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button